మా ఊరు ముచ్చట్లు

మా ఊరు ముచ్చట్లు

Title: మా ఊరు ముచ్చట్లు
Author: Bss Prasad
Release: 2025-03-29
Kind: ebook
Genre: Media Bios & Memoirs, Books, Biographies & Memoirs
Size: 383570463
కూతురి రెండో కాన్పు కోసం 2020 ఫిబ్రవరి 25నఅమెరికా వెళ్లాము. వెళ్లిన కొద్ది రోజులకే కరోనా వ్యాప్తి చెందడంతో అందరం ఇళ్లకే పరిమితమయ్యాం. వందే భారత్ మిషన్ ద్వారా టిక్కెట్లు కొనుక్కొని 2020 జులై 18న తిరిగి వచ్చాను. క్వారంటైన్‌లో ఉండగా, జులై 24న స్కూల్ స్నేహితుడు కరోనాతో చనిపోయాడనే వార్త బాధించింది. నేను పుట్టి పెరిగిన ఊరు పర్లాకిమిడిలో పరిస్థితులు, ఇతర స్నేహితులు, బంధువులు కరోనా బారిన పడటంతో జీవితంపై విరక్తి కలిగింది. భయంతో బ్రతికే బదులు, చేయాలనుకున్నది వెంటనే చేయాలనే తపనతో, సన్నిహితులను ఉల్లాసపరచడానికి “ ఊరి ముచ్చట్లు” రాయడం మొదలుపెట్టాను. రోజూ ఫోన్‌లో మాట్లాడటం, పెద్దవారు ఆప్యాయంగా పలకరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. వంద రోజుల పాటు రోజుకు 9-10 గంటలు ఈ పనిలో నిమగ్నమై, ఇతర వార్తలకు దూరంగా ఉంటూ నన్ను నేను కాపాడుకున్నాను. దూరమైన స్నేహితులను కలుపుతూ వారి మనోధైర్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాను. ఇటువంటి సమయంలో బాల్య మిత్రుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంలో కొంతవరకు సఫలమయ్యానని అనుకుంటున్నాను.